Monday, July 25, 2016

టార్కవస్కీ

"నా బాల్యం ఏమాత్రం గొప్పది కాదు .ఐనా ఆ బాల్యమంటే నాకు ఇష్టం.కలల చుట్టూ కలతిరగడం తోనే జీవితం గడిచి పోయింది.ఆ కలలంటే నాకు ప్రాణం .ఆకుపచ్చని జ్ఞాపకాల వరండా మెట్లమీదే నిలబడి ఉంటానెప్పుడూ.జ్ఞాపకాలే నా జీవితం మరి." అంటారు టార్కవస్కీ.
అయన జీవితకాలంలో తీసినవి ఏడేఏడు సినిమాలు. ఆ ఏడింటిలోనూ పైన చెప్పిన అంశాలు పుష్కలంగా వున్నాయి.అందుకేనేమో ఆయనంటే నాకు వల్లమాలినిష్టం.
ఎక్కువగా బాల్యానికి సంబందించిన కథలు ..మిగతా సినిమాల కంటే చాలా భిన్నగా వ్యత్యాసంగా వుండే స్క్రీన్ ప్లే, వివరించలేనంత గొప్ప ఫోటోగ్రఫీతో పాటు మహాద్భుతమైన నడక.
సాహితీకారులు వాడ్రేవు  చినవీరభద్రుడు గారు'' ది మిర్రర్'' సినిమా అంతకుముందు
రోజు రాత్రి చూసారంట ''ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా చూళ్ళేదు.
.ప్రతి ఫ్రేమూ ఒక పెయింటింగే...జీవితం చూస్తున్నట్టుంది'' అంటా చాలా గొప్పగా పొగిడారా అద్భుత రష్యన్ చలన చిత్రకారుడైన ఆ టార్కవస్కీని.








దేవీపట్నం గోదావరి ఒడ్డు

దేవీపట్నం గోదావరి ఒడ్డు


దేవీపట్నం గోదావరి ఒడ్డు మీద ఒకప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నపురాతన భవనం ఇది... బ్రిటిష్ వాళ్ల కాలంలో
ఇక్కడ పోలీసుస్టేషనే కాకండా ట్రావెలర్స్ బంగ్లా కూడా ఉండేదంట.ఆరోజుల్లో లాంచీ మీద
భద్రాచలం వెళ్ళేప్పుడు, ఆ లాంచీ స్టాఫ్ చాలా సందడిగా వుండే ఈ ఫెర్రీలోదిగి, స్టేషన్లో సంతకాలు పెట్టిఅప్పుడుబయలు దేరేవాళ్ళంట. 
ఈ ఒడ్డు మీద ఎన్నెన్నో చరిత్ర ఘట్టాలు.... ఎన్నో కథలు,కబుర్లు...సరసాలు,సల్లాపాలు,విరహాలు, వేదనలు.......
మారేడుమిల్లి సి.ఐ అంకబాబు గారు చెప్పిన దాని ప్రకారం.............
అల్లూరి సీతారామరాజు గారు ఈ స్టేషన్ కొచ్చారంటారు గానీ ,,,వచ్చిన ఆ దాఖలాలు మాత్రం ఎక్కడా లేవంట.








మల్కిపురం

మల్కిపురం

చాలా ఏళ్ల క్రితం కోనసీమలో వున్నమల్కిపురంలో అప్పారావు పలావు చాలా ఫేమస్.మేం లేడీస్ టైలర్ సినిమా తీసే రోజుల్లో మా ఫ్రెండ్ ముదునూరి అక్కిరాజుగారు మమ్మల్ని ఆ హోటల్ లోకి తీసుకెళ్ళేవాడు.
కాలం మారిపోయింది.ఆరోజులెల్లి పోయాయి ..ఇప్పుడా అప్పారావు కి బదులు కాకి రామారావు....అంతా '' రామారావు పలావు బాగుంది..బాగుంది'' అంటుంటే మొన్నెల్లినప్పుడు తిన్నాం...వాళ్ళంటున్నది అబద్ధం కాదు..చాలాబాగుంది ,కానీ,,,.ఆనాటి అప్పారావు గుర్తుకురాలేదు ..ఎందుకంటే వర్తమానం కంటె జ్ఞాపకమెప్పుడూ బావుంటుంది నాకు.బహుశా అందు వల్లా?...ఏమో!











A short film about love

A short film about love 

క్రిస్టఫ్ కిస్లవస్కిఅనే ఈ డైరెక్టర్ గారిది పోలండ్. వాళ్ల దేశం టీ వీ ఛానల్ కోసం బైబిల్ లో వున్నటెన్ కమాండ్మెంట్స్ మీద dekaloog అన్నపేరుతో పది సినిమాలు తీసారు.ఆ తరువాత ఎరుపు,తెలుపు,నీలం రంగులున్నఫ్రెంచ్ ఫ్లాగ్ మీద స్వేచ్ఛా,సమానత్వం,సౌబ్రాత్రుత్వం ఈ మూడు అంశాల మీద మూడు పరమాద్భుతమైన సినిమాలు తీసి....''ఇంక చాలు మీకు'' అని ఈ లోకం నించెళ్ళి పోయాడు. a short film about love [dekaloog లో ఒకటి] సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తేలీదు.ఈ సాయంత్రం ఈ మహానుభావుణ్ణి తల్చుకుoటున్ననా మనసు మనసులో లేదు.











నీవు వారణ నేను అసి...

కొన్నినెలలక్రితం మిత్రులతో వెళ్ళినప్పుడు నా పక్కనున్నజీవా అనే కొత్తమిత్రుడు''చాలా బాగుoదండీగోదావరి. కానీ,ఇంతకుముందే ఈ ప్రాంతాలన్నీమా భ్రమరతో కలతిరిగేసేను. ఐతే, తనిప్పుడు వారణాసి వెళ్లిపోయిందనుకోండి'' అన్నాడు. అది విన్నసాయిరాజ్ అనే ఇంకో మిత్రుడు'' ఆవిడెక్కడికెళ్ళినా కలిసే వున్నారా..బ్రేకప్ అయ్యేరా?''అన్నాడు.

భళే వారే రెగ్యులర్ గా ఫోన్లు మాటాడు కుంటాం''అన్నాడు జీవా.
''సంతోషం ....ఐతే నువ్వీ ఒడ్డు తనా ఒడ్డు అన్నమాట''అన్నాడు సాయిరాజ్
అక్కడ్నించి ఆ జీవా ప్రేమ కథ మీద చర్చమొదలయ్యింది వాళ్ళలా మాటాడుకుంటుంటే... జనంలో కెళ్ళి పాపులర్ కాని వేటూరి గారి పాటొకటి గుర్తు కొచ్చింది నాకు...

నీవు వారణ నేను అసి
వలచి వచ్చిన ప్రేయసి
అనురాగం మనమతము
ఇది అసిధారావ్రతము
స్వర్గాదఫీ గరీయసీ
ప్రేమే కదా వారణాసి










కొత్త జంట


కొత్త జంట 

పడవలో వున్న వాళ్ళిద్దరికీ లాస్టియరే పెళ్లయిన్దంట, వాళ్ల ఊరయిన కపిలేశ్వరపురం నించొచ్చిన వాళ్ళిద్దరి మకాం ఈ గోదారి ఇసకతిప్ప మీదేసుకున్న
రెల్లుపాకలో...పగలు ఎండలు... రాత్రి వెన్నెల...........
వలలో దొరికిన చేపల్తో పొట్ట పోసుకునే వాళ్ళు రేపోచ్చె వర్షాకాలంలో ఇదే పడవ 
మీద వాళ్ళూరెల్లి పోయి , దీపలమాస వెళ్ళిపోయాక మళ్లి తిరిగొస్తారoట.వాళ్లనలా చూస్తుంటే ''అద్భుతమైన జీవితం ఆడి కార్లో లేదు,ఐదు నక్షత్రాల హోటల్లో అసలేలేదు'' అనిపించిందంట నా కూడా వున్నమిత్రులకి.






రంగుల అద్దాలమేడ

ఆత్రేయపురం దాటి 4 కిలోమీటర్లు వెళ్ళాక, ఎడమ పక్కనున్నవంతెన దిగి లోపలి కెళితే వేల్చేరు గ్రామం వస్తుంది .అది దాటి లోపలికేలితే వచే అగ్రహారంలో ఉందీ ఒకనాటి రంగుల అద్దాలమేడ.









కూనవరం గోదావరి

కూనవరం గోదావరి...


ఇది మల్లెలవేళయనీ.....ఇది వెన్నెల మాసమని..

మిత్రుడు విజయబాబు నేనూ మొన్న పౌర్ణమి రోజున కూనవరం గోదావరంతా కలతిరిగాo..ఈసారి చాలా జ్ఞాపకం చేసాడు చంద్రుడు.





పాతకాలం రైల్వేక్వార్టర్స్

పాతకాలం రైల్వేక్వార్టర్స్


ఇప్పటికీ ఒకటిఅరా మిత్రులు చూసివచ్చిచెపుతుంటారు... మొన్నకూడా మా ప్రాంతం ఒక రెడ్డిగారు పిక్స్ పంపారు.
సరే..... చాలా ఏళ్ళయ్యింది గదాని ఆనాడు'' ఏప్రిల్1విడుదల ''తీసిన రాజమండ్రిలో ఆ పాతకాలం రైల్వేక్వార్టర్స్ ని చూడానిక్కెల్లిన .....నేను , కస్సేపక్కడ కలతిరిగేక.... శిధిలమయిన వాటినింక చూడలేక వెనక్కొచ్చ్చేసాను.


కొన్ని ఇంతేనేమో....
జీవితం లోంచి వెళ్ళిపోయిన ప్రేయసి లాంటి వాటిని ఆకుపచ్చని జ్ఞాపకంలా మనసులోపదిలంగా ఉంచుకోవాలి తప్ప మళ్లి చూడాలని ప్రయత్నాలు చెయ్యకూడదేమో...





గూటాల(గ్రామం)

గూటాల(గ్రామం)

ప్రశాంతము,పవిత్రము ఐన ఈ రాములోరి గుడి,గోదావరి ఒడ్డునున్న గూటాల{గ్రామం] రేవులో వుంది{పక్కనే అయ్యప్పా,వీరబ్రహ్మేంద్ర స్వాముల గుళ్ళుకూడా వున్నాయి} ఒక ఆద్భుతమైన అనుభూతిని పొందాలని అనుకున్న ఎవరైనా సరే ఓసారా గుళ్ళోకెళ్ళి,రేవులో కూర్చోండి కాసేపు.