Monday, July 25, 2016

గాలికొండపురం రైల్వేగేట్

గాలికొండపురం రైల్వేగేట్

చాలా ఏళ్ల క్రితం గాలికొండపురం రైల్వేగేట్ అన్న పేరుతో ఒక నవల రాశాను ....అది ఈ అరకులో ఇక్కడే మొదలవుతుంది .....ఇవ్వాళ పొద్దుటనెమళ్లు,కోళ్ళు కలగలిసి కూస్తున్నవేళా... ఇదే అరకు లో ఆనాడు మంచులో తడిసి,తడిసి ముద్దయిన జ్ఞాపకాలూ...





సఖినేటిపల్లి రేవు

సఖినేటిపల్లి రేవు

సఖినేటిపల్లి రేవులో ఒంటరిగా ఏదో వెతుక్కుంటూ వెళ్లిపోతున్న కృష్ణేశ్వర్రావుగారు...




సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామం లో మిత్రులు దిలీప్ రాజు గారి గెస్ట్ హౌస్ లోంచి చివరాఖరికి చేరుతున్నగోదావరి...

పౌర్ణమిరొజు పాపికొండలు

పౌర్ణమిరొజు పాపికొండలు

మిత్రులు విజయ్ బాబు పౌర్ణమిరొజు పాపికొండలు తీసుకెళ్ళారు మమ్మల్ని...గోదావరి అంటే ఇంత ఇష్టం వున్నమనిషిని నా జీవితంలో చూళ్ళేదు అంత ఇష్టం విజయ్ బాబు కి...



పాపికొండలు దాటేక పేరంటపల్లి దగ్గర నావలో వెళ్తున్న మా మిత్ర బృందo.... ఇక్కడ గోదావరి మూడు తాడిచెట్ల లోతంట...



అఖండ గోదావరి ఒడ్డున ఆ సాయంత్రం పూట ఇంకాసేపట్లో రాబోయే జాబిలి కోసం చూస్తా ఆళ్ళు ముగ్గురూ.ఆళ్ళని చూస్తా మేం ముగ్గురం...



పాపికొండలు కి ముందు తగిలే శివగిరి ఊరి పక్కన జాబిల్లి inn అనే పేరుతొ ఈ రిసార్ట్స్ ని దుర్గాప్రసాద్ అనే మిత్రుడు ఈ ఈమద్యే కట్టారు.....బావున్నాయి.




















రాజోలు

రాజోలు 

ఆ రోజుల్లో రాజోలు చుట్టు పక్కల గ్రామాల్లో నేను షూట్ చేసిన లేడీస్ టైలర్... శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాల లొకేషన్స్ లో కొన్ని....ఐతే,.ఈ లొకేషన్స్ మాకు చూపించి,షూటింగ్ జరుగుతున్నంత కాలం నా పక్కనేవున్న మనిషి ....,నా మిత్రుడు,రాజోలు నివాసి అయిన ముదునూరు అక్కిరాజుని నేనెప్పటికీ మరిచి పోలేను.












ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్ - 1990

ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్ - 1990

1990 ఢిల్లీ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లినప్పుడు ఫోటో...

గోదావరి, గోపిక ఫోటోలు...

గోదావరి, గోపిక ఫోటోలు...

గోపి గోపిక గోదావరి సినిమా షూటింగ్ రోజుల్లో తీసిన గోదావరి, గోపిక ఫోటోలు.








ఆ రాజులూ వారి మర్యాదలు...

ఆ రాజులూ వారి మర్యాదలు

మొగలమూరులో ఫణిగారి గెస్ట్హౌస్ పక్కన.......ఆ రాజులూ వారి మర్యాదలు మరిచి పోలేం...